డా. అక్కినేని నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు గ్రీకువీరుడు ఫొటోగ్యాలరీ డమరుకం ఉత్తరాంధ్ర ధియేటర్లు (అప్‌డేట్) డమరుకం పై గత భారాలేవీ లేకపోతే టేబుల్ ప్రాఫిట్‌తో విడుదలయ్యేది ! - నాగార్జున "డమరుకం" రిలీజ్‍లో గందరగోళం నాగార్జున పాతికేళ్ళ క్రితమే ఊహించినదేమిటి ? ఉత్తరాంధ్రలో శిరిడిసాయి రిలీజ్ థియేటర్లు నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు ఆల్‌ ఇండియా నాగార్జున ఫాన్స్‌ అధ్యక్షులు రవీందర్‌రెడ్డి 60 వసంతాల "దేవదాసు" "డమరుకం" ఫొటోగ్యాలరీ కళాభినేత్రి వాణిశ్రీ గారూ... మీకిది తగునా..? ఆ ఆరోపణల్లో నిజమెంత ? సినీ వాల్మీకి అక్కినేని 3వ సంవత్సరంలో చైతన్య ఏయన్నార్ & ఎన్టీఆర్ ఫొటోలు సినీరంగంలో 67వసంతాల అక్కినేని మన్మథుడికి పాతికేళ్ళు "మజ్ను100 రోజుల కేంద్రాలు దేవదాసు మళ్ళీ పుట్టాడు, ఊరంతా సంక్రాంతి చిత్రాల ప్రారంభోత్సవ ఏడ్స్ " సాక్షి "లో వచ్చిన "ఫారిన్‌ట్రిప్‌"కి కౌంటర్" బెజవాడ వాల్‌పేపర్స్ బెజవాడ వర్కింగ్‌ స్టిల్స్ బెజవాడ ఫొటోగ్యాలరీ "దడ" వాల్‌ పేపర్స్ ధడ ఫొటోగ్యాలరీ సినిమావార పత్రికల కవర్‌పేజీలు 100% లవ్ చిత్రాలకు ప్రేరణ అక్కినేని హీరోలే ! గగనం రివ్యూ " సువర్ణ సుందరి " విశేషాలు వైజాగ్ "గగనం" ప్రీమియర్‌షో లో నాగార్జున "గగనం" ఏడ్స్ & ప్రీమియర్‌షో టికెట్ నాగచైతన్య ఇంటర్వ్యూ " స్వప్న సుందరి " విశేషాలు దసరాబుల్లోడు విశేషాలు "అక్కినేని నటవృక్షం కేలండర్‌ - 2011" "నాగచైతన్య"కు రికార్డులతో శుభాకాంక్షలు స్టూడెంట్ నోట్‌బుక్స్‌పై "నాగచైతన్య"

Mar 4, 2011

గగనం రివ్యూ

గగనం రివ్యూ

gaganam

ది నిమిషాలు.

ఐదుగురు టెర్రరిస్టులు తమ అధీనంలో ఉన్న 100 మంది ప్రయాణీకులను పాడైపోయిన ఒక విమానంలోంచి ఇంకొ విమానంలోకి మార్చబోతున్నారు. ఈ మార్పిడికి పట్టే సమయం పది నిమిషాలు. వాళ్ళు రెండవ విమానంలోకి మారితే ఈ ప్రయాణీకులెవరూ ప్రాణాలతో మిగలరు. వాళ్ళను రెండో విమానం ఎక్కకుండా ఆపితే వారు తమదగ్గర ఉన్న శక్తివంతమైన బాంబును పేల్చే ప్రమాదం ఉంది. అలా ఐనా అందరూ చనిపోతారు.

ప్రయాణీకులెవరూ చనిపోకుండా ఈ టెర్రరిస్టులను అంతమొందించటం కమాండో గ్రూపు నాయకుడి లక్ష్యం. ఆ పని చేయటానికి అతనికి ఉన్న అవకాశం ఈ పది నిమిషాలే. కానీ ఎవరు టెర్రరిస్టులో, ఎవరు నిజమైన ప్రయాణీకులో అతనికి తెలీదు. ఐనా, అతని ప్లాన్లు అతనికి ఉన్నాయి.

పది నిమిషాలు.

విమానం తలుపులు తెరుచుకొని మొదటి మనిషి మెట్లు దిగుతున్నాడు. తెర మీద డిజిటల్ గడియారం కౌంట్‌డౌన్ మొదలయ్యింది. అప్పట్నుంచి పది నిమిషాలపాటు ఆ గడియారం మనకు కనిపిస్తూనే ఉంటుంది.

తెలుగు తెర మీద, ఏ మాత్రం వదులుతనం లేకుండా, మంచి ఉత్కంఠతో తీసిన పది నిమిషాలు ఇవి. గగనం చిత్రం పతాకసన్నివేశం ఇది.

రెండేళ్ళ క్రితం ఆకాశమంతా చిత్రం చూసినప్పుడే దర్శకుడు రాధామోహన్‌మీద చాలా ప్రేమ కలిగింది. తండ్రీ కూతుళ్ళ అనుబంధాన్ని చాలా సున్నితంగా, హాస్యభరితంగా, హృద్యంగా చూపిన చిత్రం అది. ఈ రెండో చిత్రం తీరే వేరు. ఇది పూర్తి నిడివి యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రాన్నీ అంతే మనోరంజకంగా తీశాడు. ఇతనికి సినిమాల మీద ప్రేమ ఉంది. మంచి సినిమాలు ఎలా ఉంటాయోనన్న జ్ఞానం ఉంది. చేసే పని మీద శ్రద్ధ ఉంది. సెన్సూ, సెన్సిబిలిటీ ఉన్నాయి. అన్నిటికీ మించి తన సినిమాలు చూసే ప్రేక్షకుల మీద గౌరవం ఉంది. అందుకే తీసిన రెండు సినిమాలూ ఇంత బాగా తీశాడు.

తెలుగులో యాక్షన్ థ్రిల్లర్‌ను వేరే కలగలుపులేమీ లేకుండా తీయడం ఈ చిత్రం ప్రత్యేకత. కథలో అంతర్భాగంగా మంచి హాస్యం ఉంది. ఈ హాస్యం చిత్రం టెంపోకు ఎలాంటి ఆటంకాలూ కల్పించదు. ఈ చిత్రానికి ఒక హీరో ఉన్నాడు కాని హీరోయిన్లు లేరు. డ్యూయెట్లేకాదు, అసలు పాటలే లేవు. ఫారిన్ లొకేషన్లూ లేవు. ఈ చిత్రంలో నటించటానికి ముందుకు వచ్చిన నాగార్జునకు, ఇతర నటులకు, ఈ చిత్ర నిర్మాతలకు, సాంకేతిక వర్గానికి నా అభినందనలు.

ఇది ప్రయోగాత్మక చిత్రం అని వాడుకలో ఉన్న మాట. 2011లో, అరవైఐదేళ్ళ చరిత్ర ఉన్న చిత్రరంగంలో, ఇలాంటి చిత్రాలు మనకు ఇంకా ప్రయోగాత్మకమే అవ్వటం మాత్రం నిజంగా మన చిత్రరంగపు దౌర్భాగ్యానికి నిదర్శనం.

ఇంగ్లీషు యాక్షన్ సినిమాలు చూసే అలవాటు ఉన్నవారికి ఈ చిత్రం ప్రత్యేకంగా అనిపించకపోవచ్చు. చాలా లోపాలూ కనిపించవచ్చు. కానీ, ఈ స్థాయి భారతీయ చిత్రాలు చాలా తక్కువగా వచ్చాయి. తెలుగులో ఐతే లెక్క పెట్టడానికి ఒక్క చేయి వేళ్ళు సరిపోతాయి. ముప్పై ఏళ్ళ క్రితం రాజ్ సిప్పీ (ఇన్కార్), ఇరవై ఏళ్ళ క్రితం రామగోపాల వర్మ (శివ), మూడేళ్ళ క్రితం నీరజ్ పాండే (A Wednesday) ఆశపెట్టారు. ఇప్పుడు రాధామోహన్.

ఈ చిత్రాన్ని మన ప్రేక్షకులు (తమిళ ప్రేక్షకులు కూడా – ఇదే చిత్రం పయనం పేరిట తమిళంలో విదుదలయ్యింది) ఆదరిస్తారనీ, ఇలాటి చిత్రాలు మనకు ఎక్కువగానే వస్తాయనీ ఆశిద్దాం.

V. Chowdary Jampala

curtesy : navatarangam.com

1 comments:

Kishor said...

సినిమా నిజంగా అంతబావుందంటారా? జస్ట్... ఆముదం మొక్క కాదా?